Tuesday, February 25, 2025

sheethakalamlo christmas kanthulatho శీతాకాలంలో క్రిస్ట్మస్ కాంతులతో ఓహోఓహోఓహోఓహో lyrics

 ఓహో...ఓహో...ఓహో...ఓహో... ॥4॥

శీతాకాలంలో క్రిస్ట్మస్ కాంతులతో
జనియించిన శ్రీ యేసుని నీడలో ॥2॥
చీకు లేదు చింతా లేదు చాలా సంతోషం
బాధాలేదు భయము లేదు భలే ఆనందం ॥2॥
*హ్యాపీ క్రిస్ట్మస్ మెర్రీ క్రిస్ట్మస్*॥2॥
॥శీతాకాలంలో॥

1. యాకోబులో నక్షత్రం ఉదయించెను
తూర్పుదేశ జ్ఞానులు గుర్తించెను ॥2॥
బెత్లెహేములో యేసుని చూచి
కానుకలిచ్చెను నాడు
ఆరాధించి ఆనందించి ॥2॥
యేసుని చాటెనుచూడు
*హ్యాపీ క్రిస్ట్మస్ మెర్రీ క్రిస్ట్మస్*॥2॥
॥శీతాకాలంలో॥

2. పొలమందు కాపరులకు దూత చెప్పెను
రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు ॥2॥
పశువుల తొట్టిలో ప్రభువును చూచి
పరవశమొందిరి వారు
కని విన్నవాటిని ప్రచురము చేసి ॥2॥
మహిమ పరచెను చూడు
*హ్యపీ క్రిస్ట్మస్ మెర్రీ క్రిస్ట్మస్*॥2॥
॥శీతాకాలంలో॥

No comments: