Friday, March 7, 2025

Yehova Nee Naamamu - యెహోవా నీ నామము

 యెహోవా నీ నామము ఎంతో బలమైనది

ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది
యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది
ఆ…ఆ…ఆ…  ఎంతో ఘనమైనది         || యెహోవా ||

1. మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి ||2||
యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి ||2||          || యెహోవా ||

2. నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా ||2||
అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి ||2||                   || యెహోవా ||

3. సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి ||2||
ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము ||2||                        || యెహోవా ||

4. చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా ||2||
సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను ||2||               || యెహోవా ||

5. పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా ||2||
పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయే ||2||               || యెహోవా ||

Yerigi yunnanaya - ఎరిగియున్నానయా

 ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని

తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని

మార్పులేని దేవుడ నీవని - మాట ఇచ్చి నెరవేర్చుతావని ||2||
మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని

1. నను చుట్టుముట్టిన బాధలతో నాహృదయం కలవరపడగా
నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా ||2||
అక్కున నన్ను చేర్చుకుంటివే - భయపడకంటివే
మిక్కుట ప్రేమను చూపితివే నను ఓదార్చితివే ||2||   || ఎరిగియున్నానయా ||

2. మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా
వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాధుడా ||2||
నిరాశలో నన్ను దర్శించితివే - ఆదరించితివే
సజీవునిగా నన్నుంచితివే - కృపను పంచితివే ||2||   || ఎరిగియున్నానయా ||

Yesayya kanikarapoornuda - యేసయ్యా కనికరపూర్ణుడా

 యేసయ్యా కనికరపూర్ణుడా

మనోహర ప్రేమకు నిలయుడా (2)
నీవే నా సంతోష గానము
సర్వ సంపదలకు ఆధారము (2)          ||యేసయ్యా||

1. నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి
నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి (2)
సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి
శాశ్వత కృప పొంది జీవింతును ఇల నీ కొరకే (2)          ||యేసయ్యా||

2. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు
దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి (2)
అలసిన వారి ఆశను తృప్తిపరచితివి
అనంత కృపపొంది ఆరాధింతును అనుక్షణము (2)          ||యేసయ్యా||

3. నీ వలన బలమునొందిన వారే ధన్యులు
నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు (2)
నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు
నిత్యము కృపపొంది సేవించెదను తుదివరకు (2)          ||యేసయ్యా||

ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు (4)
ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు (4)

Yesayya Naa Hrudaya Spandana - యేసయ్యా నా హృదయ స్పందన

 యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2)

విశ్వమంతా నీ నామము ఘణనీయము (2)              ||యేసయ్యా||


1. నీవు కనిపించని రోజున  
ఒక క్షణమొక యుగముగా మారెనే (2)
నీవు నడిపించిన రోజున  
యుగయుగాల తలపు మది నిండెనే (2)
యుగయుగాల తలపు మది నిండెనే                       ||యేసయ్యా||


2. నీవు మాట్లాడని రోజున  
నా కనులకు నిద్దుర కరువాయెనే (2)  
నీవు పెదవిప్పిన రోజున  
నీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2)
నీ సన్నిధి పచ్చిక బయలాయెనే                 ||యేసయ్యా||


3. నీవు వరునిగా విచ్చేయి వేళ
నా తలపుల పంట పండునే (2)
వధువునై నేను నిను చేరగా
యుగయుగాలు నన్నేలు కొందువనే (2)
యుగయుగాలు నన్నేలు కొందువనే                      ||యేసయ్యా||

Yesayya nee krupa - యేసయ్యా నీ కృపా

 యేసయ్యా నీ కృపా

నను అమరత్వానికి
అర్హునిగా మార్చెను
యేసయ్యా నీ కృపా  || యేసయ్యా ||

1. నీ హస్తపు నీడకు పరుగెత్తగా
నీ శాశ్వత కృపతో నింపితివా -2
నీ సన్నిధిలో దీనుడనై
కాచుకొనెద నీ కృప ఎన్నడు -2 || యేసయ్యా ||

2. నీ నిత్య మహిమకు పిలిచితివా
నీ స్వాస్ధ్యముగా నన్ను మార్చితివా -2
ఆత్మాభిషేకముతో స్ధిరపరచిన
ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును - 2  || యేసయ్యా ||

3. గువ్వవలె నే నెరిగి నిను చేరనా
నీ కౌగిటనే నొదిగి హర్షించనా - 2
ఈ కోరిక నాలో తీరునా?
రాకడలోనే తీరును -2  || యేసయ్యా ||

Yese naa Parihaari - యేసే నా పరిహారి

 యేసే నా పరిహారి

ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత కాలమెల్ల
ప్రియ ప్రభువే నా పరిహారి ||2||         ||యేసే నా||

1. ఎన్ని కష్టాలు కలిగిననూ
నన్ను కృంగించె భాదలెన్నో ||2||
ఎన్ని నష్టాలు వాటిల్లినా
ప్రియ ప్రభువే నా పరిహారి ||2||         ||యేసే నా||

2. నన్ను సాతాను వెంబడించినా
నన్ను శత్రువు ఎదిరించినా ||2||
పలు నిందలు నను చుట్టినా
ప్రియ ప్రభువే నా పరిహారి ||2||          ||యేసే నా||

3. మణి మాన్యాలు లేకున్ననూ
పలు వేదనలు వేధించినా ||2||
నరులెల్లరు నను విడచినా
ప్రియ ప్రభువే నా పరిహారి ||2||         ||యేసే నా||

4. బహు వ్యాధులు నను సోకినా
నాకు శాంతి కరువైనా ||2||
నను శోధకుడు శోధించినా
ప్రియ ప్రభువే నా పరిహారి ||2||          ||యేసే నా||

5. దేవా నీవే నా ఆధారం
నీ ప్రేమకు సాటెవ్వరూ ||2||
నా జీవిత కాలమంతా
నిన్ను పాడి స్తుతించెదను ||2||          ||యేసే నా||

Yesu Rakthamu Rakthamu - యేసు రక్తము రక్తము

 యేసు రక్తము రక్తము రక్తము ||2||

అమూల్యమైన రక్తము
నిష్కళంకమైన రక్తము       ||యేసు రక్తము||

1. ప్రతి ఘోర పాపమును కడుగును
మన యేసయ్య రక్తము ||2||
బహు దు:ఖములో మునిగెనే
చెమట రక్తముగా మారెనే ||2||      ||యేసు రక్తము||

2. మనస్సాక్షిని శుద్ధి చేయును
మన యేసయ్య రక్తము ||2||
మన శిక్షను తొలగించెను
సంహారమునే తప్పించెను ||2||      ||యేసు రక్తము||

3. మహా పరిశుద్ద స్థలములో చేర్చును
మన యేసయ్య రక్తము ||2||
మన ప్రధాన యాజకుడు
మన కంటె ముందుగా వెళ్ళెను ||2||      ||యేసు రక్తము||

Yesutho teeviganu Podama - యేసుతో ఠీవిగాను పోదమా

 యేసుతో ఠీవిగాను పోదమా

అడ్డుగా వచ్చు వైరి గెల్వను

యుద్ధనాదంబుతో బోదము            ||యేసుతో||

1. రారాజు సైన్యమందు చేరను

ఆ రాజు దివ్య సేవ చేయను (2)

యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా (2)

యేసుతో ఠీవిగాను వెడలను           ||యేసుతో||

2. విశ్వాస కవచమును ధరించుచు

ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు (2)

అనుదినంబు శక్తిని పొందుచున్నవారమై (2)

యేసుతో ఠీవిగాను వెడలను           ||యేసుతో||

3. శోధనలు మనల చుట్టి వచ్చినా

సాతాను అంబులెన్ని తగిలినా (2)

భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము (2)

యేసుతో ఠీవిగాను వెడలను           ||యేసుతో||

4. ఓ యువతి యువకులారా చేరుడి

శ్రీ యేసురాజు వార్త చాటుడి (2)

లోకమంత ఏకమై యేసునాథు గొల్వను (2)

సాధనంబెవరు నీవు నేనెగా            ||యేసుతో||

Yoodha Sthuthi Gothrapu - యూదా స్తుతి గోత్రపు

 యూదా స్తుతి గోత్రపు సింహమా

యేసయ్య నా ఆత్మీయ ప్రగతి నీ స్వాదీనమా
నీవే కదా నా ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా ||2||

1. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని
అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు ||2||
అసాద్యమైనది ఏమున్నది ||2||  ||యూదా||

2. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని
అనతి కాలానా ప్రధమ ఫలముగా పక్వ పరిచిన నీకు ||2||
అసాద్యమైనది ఏమున్నది ||2||  ||యూదా||

3. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని
అత్యున్నతమైన సింహాసనములు నాకిచ్చుటలో నీకు ||2||
అసాద్యమైనది ఏమున్నది ||2||  ||యూదా||

Sthothram Chellinthumu - స్తోత్రం చెల్లింతుము

 స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము

యేసు నాథుని మేలులు తలంచి          ||స్తోత్రం||


1. దివారాత్రములు కంటిపాపవలె కాచి (2)
దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి (2)       ||స్తోత్రం||


2. గాడాంధకారములో కన్నీటి లోయలలో (2)
కృశించి పోనీయక కృపలతో బలపరచితివి (2)      ||స్తోత్రం||


3. సజీవ యాగముగా మా శరీరము సమర్పించి (2)
సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి (2)      ||స్తోత్రం||


4. సీయోను మార్గములో పలుశోధనలు రాగా (2)
సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి (2)     ||స్తోత్రం||


5. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2)
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2)       ||స్తోత్రం||


6. పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా (2)
సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా (2)      ||స్తోత్రం||

Sthuthi Gaaname Paadana - స్తుతి గానమే పాడనా

 స్తుతి గానమే పాడనా

జయగీతమే పాడనా (2)
నా ఆధారమైయున్న
యేసయ్యా నీకు – కృతజ్ఞుడనై
జీవితమంతయు సాక్షినై యుందును (2) ||స్తుతి||

1. నమ్మదగినవి నీ న్యాయ విధులు
మేలిమి బంగారు కంటే – ఎంతో కోరతగినవి (2)
నీ ధర్మాసనము – నా హృదయములో
స్థాపించబడియున్నది – పరిశుద్ధాత్మునిచే (2) ||స్తుతి||

2. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు
లౌకిక జ్ఞానము కంటే – ఎంతో ఉపయుక్తమైనవి (2)
నీ శ్రేష్టమైన – పరిచర్యలకై
కృపావరములతో నను – అలంకరించితివే (2) ||స్తుతి||

3. నూతనమైనది నీ జీవ మార్గము
విశాల మార్గము కంటే – ఎంతో ఆశించదగినది (2)
నీ సింహాసనము – నను చేర్చుటకై
నాతో నీవుంటివే – నా గురి నీవైతివే (2) ||స్తుతి||

Stuthi Paadutake Brathikinchina - స్తుతి పాడుటకే బ్రతికించిన

 స్తుతి పాడుటకే బ్రతికించిన

జీవనదాతవు నీవేనయ్యా

ఇన్నాళ్లుగా నన్ను పోషించినా

తల్లివలె నన్ను ఓదార్చినా

నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా  - 2

జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా

నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును

1. ప్రాణభయమును తొలగించినావు

ప్రాకారములను స్థాపించినావు

సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు  ||2||

నీ కృపా బాహుళ్యమే-వీడని అనుబంధమై

తలచిన ప్రతిక్షణమున-నూతన బలమిచ్చెను  ||  స్తుతి ॥

2. నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు

కనుమరుగాయెను నా దుఖ:దినములు

కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు ||2||

నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై

నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను.     ॥ స్తుతి ॥

3. హేతువులేకయే ప్రేమించినావు

వేడుకగా ఇల నను మార్చినావు

కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు ||2||

నీ ప్రేమ మాధుర్యమే- నా నోట స్తుతిగానమై

నిలిచిన ప్రతిస్థలమున -పారెను సెలయేరులై          ॥ స్తుతి ||

Stuthi paathruda - స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా

 స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా

స్తుతులందుకో పూజార్హుడా (2)
ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు నా ప్రభు (2) ||స్తుతి||


1. నా శత్రువులు నను తరుముచుండగా
నా యాత్మ నాలో కృంగెనే ప్రభు (2)
నా మనస్సు నీవైపు – త్రిప్పిన వెంటనే
శత్రువుల చేతినుండి విడిపించినావు
కాపాడినావు (2) ||స్తుతి||


2. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి
దూరాన నిలిచేరు నా ప్రభూ (2)
నీ వాక్య ధ్యానమే – నా త్రోవకు వెలుగై
నను నిల్పెను నీ సన్నిధిలో
నీ సంఘములో (2) ||స్తుతి||

Sthuthi Simhaasanaaseenuda - స్తుతి సింహాసనాసీనుడా

 స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు యోగ్యుడా -2

నాలో నీవుండగా నీలో నేనుండగా
ఇక నేనేల బయపడుదును - 2 ||స్తుతి||

1. ఆకాశము నీ సింహాసనం భూమి నీ పాద పీఠం -2
ఆ సింహాసనము విడచి సిలువకు దిగి వచ్చి ప్రాణ త్యాగము చేసి - 2
నీ ప్రేమామృతము త్రాగించితివి
నిన్ను స్తుతించుటకు బ్రతికించితివి -2  ||స్తుతి||

2. రాజాధిరాజ ప్రభువులకు ప్రభువా ఎవరు నీకిలలో సాటి -2
సదాకాలం నిలిచే నీ సింహాసనం జయించినవారికే సొంతం - 2
ఈ జీవన పోరాటంలో
నాకు జయమిచ్చుట నీకే సాధ్యం - 2  ||స్తుతి||

3. నీ రాజ్యము లోక సంబంధమైనది కానేకాదంటివే -2
నా షాలేము రారాజా స్థాపించితివీ నీ బలముతో ప్రేమ రాజ్యం -2
మార్పులేని నీ కృపతో నా ప్రభువా
మార్చితివే నీ రాజ్య పౌరునిగా -2  ||స్తుతి||

Sthuthi Simhaasanaaseenuda - స్తుతి సింహాసనాసీనుడా

 స్తుతి సింహాసనాసీనుడా

నా ఆరాధనకు పాత్రుడా ||2||
నీవేగా నా దైవము
యుగయుగాలు నే పాడెదన్ ||2|| ||స్తుతి||

1. నా వేదనలో నా శోధనలో
లోకుల సాయం వ్యర్థమని తలచి ||2||
నీ కోసమే – నీ కృప కోసమే ||2||
నీ సముఖములో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ ఆత్మతో నింపుమయ్యా ||2|| ||స్తుతి||

2. నీ సేవలోనే తరియించాలని
నీ దరికి ఆత్మలను నడిపించాలని ||2||
నీ కోసమే – నీ కృప కోసమే ||2||
నీ నీడలో నిలిచానయ్యా యేసయ్యా..
నీ శక్తితో నింపుమయ్యా ||2|| ||స్తుతి||

3. నా ఆశయముతో నా కోరికతో
నా గురి నీవని పరుగిడుచుంటిని ||2||
నీ కోసమే – నీ కృప కోసమే ||2||
నీ వెలుగులో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ మహిమతో నింపుమయ్యా ||2|| ||స్తుతి||

Sthuthi Sthothramulu Ganatha Mahimalu - స్తుతి స్తోత్రములు ఘనత మహిమలు

 స్తుతి స్తోత్రములు - ఘనత మహిమలు యేసు ప్రభుని కెల్లప్పుడు

తర తరములలో యుగ యుగములలో
ప్రతి హృదయములో - స్తుతులు - హల్లెలూయ - హల్లెలూయ

1. దేవుని సన్నిధి ప్రేమనిధి - నీతో నున్నది ఎల్లప్పుడు
పరికించు ఆ.. ఆ.. ఆ.. తరుణమిదే ఆ.. ఆ.. ఆ..
ప్రభువుతో పయనించు                                      ||స్తుతి||

2. మార్గములన్నిటిలో మిన్న - రక్షణ మార్గము యెసన్నా
త్వరపడుమా ఆ.. ఆ.. ఆ.. తరుణమిదే ఆ.. ఆ.. ఆ..
రక్షణ సమయమిదే                                       ||స్తుతి||

3. కడవరి దినముల కలుషముతో - కనబడుచున్నది ప్రభు వెలుగు
కనుదెరచి ఆ.. ఆ.. ఆ... హృదితెరచి... ఆ... ఆ... ఆ...
స్తుతులతో సాగుమీదే                                       ||స్తుతి||

Sthuthiki Paathruda - స్తుతికి పాత్రుడా

 స్తుతికి పాత్రుడా - స్తోత్రార్హుడా

శుభప్రదమైన నిరీక్షణతో - శుభప్రదమైన నిరీక్షణతో
జయగీతమే పాడెద- అ - ఆ - ఆ
జయగీతమే పాడెద- అ - ఆ - ఆ

1. నా కృప నిన్ను విడువదంటివే ||2||
నా కృప నీకు చాలునంటివే నాకేమి కొదువ ||2|| ॥ స్తుతికి ॥

2. ప్రభువా నీ వలన పొందిన ఈ ||2||
పరిచర్యనంతయు తుదివరకు కృపలో ముగించెద ||2|| ॥ స్తుతికి ॥

3. ఇహపరమందున నీవే నాకని ||2||
ఇక ఏదియు నాకు అక్కరలేదని స్వాస్థ్యమే నీవని ||2|| ॥ స్తుతికి ॥

Sugunaala Sampannuda - సుగుణాల సంపన్నుడా

 సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా

జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ మాటల మకరందము

1. యేసయ్య నీతో జీవించగానే
నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే (2)
నాట్యమాడేను నా అంతరంగము
ఇది రక్షణానంద భాగ్యమే  (2)  ||సుగుణాల||

2. యేసయ్య నిన్ను వెన్నంటగానే
ఆజ్ఞల మార్గము కనిపించెనే (2)
నీవు నన్ను నడిపించాగలవు
నేను నడవవలసిన త్రోవలో (2) ||సుగుణాల||

3. యేసయ్య నీ కృప తలంచగానే
నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే (2)
నీవు నాకిచ్చే మహిమ ఎదుట
ఇవి ఎన్నతగినవి కావే (2) ||సుగుణాల||

Sumadhura Swaramula - సుమధుర స్వరముల

 సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో

కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన ||2||
మహదానందమే నాలో పరవశమే
నిన్ను స్తుతించిన ప్రతీక్షణం ||2||        ||సుమధుర||

1. ఎడారి త్రోవలో నే నడిచినా – ఎరుగని మార్గములో నను నడిపినా
నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా ||2||
నీవే నీవే – నా ఆనందము
నీవే నీవే – నా ఆధారము ||2||        ||సుమధుర||

2. సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నను విడువక – నా ధైర్యము నీవేగా ||2||
నీవే నీవే – నా జయగీతము
నీవే నీవే – నా స్తుతిగీతము ||2||        ||సుమధుర||

3. వేలాది నదులన్ని నీ మహిమను – తరంగపు పొంగులు నీ బలమును
పర్వత శ్రేణులు నీ కీర్తినే – ప్రకటించుచున్నవేగా ||2||
నీవే నీవే – నా అతిశయము
నీకే నీకే – నా ఆరాధన ||2||        ||సుమధుర||

Thriyeka Devudaina - త్రియేక దేవుడైన

 త్రియేక దేవుడైన యెహోవాను

కెరూబులు సెరావులు నిత్యము ఆరాధించుదురు
పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని
గాన ప్రతి గానములు చేయుచు ఉండును

1. నా శాపము బాపిన రక్షణతో
నా రోగాల పర్వము ముగిసేనే
వైద్య శాస్త్రములు గ్రహించలేని
ఆశ్చర్యములెన్నో చేసినావే|| త్రియేక ||

2. నా నిర్జీవ క్రియలను రూపు మాపిన
పరిశుద్ధాత్మలో ఫలించెదనే
మేఘ మధనములు చేయలేని
దీవెన వర్షము కురిపించినావే|| త్రియేక ||

3. నా స్థితిని మార్చిన స్తుతులతో
నా హృదయము పొంగిపొర్లేనే
జలాశయములు భరించలేని
జలప్రళయములను స్తుతి ఆపెనే|| త్రియేక ||

Utsaha gaanamu chesadamu - ఉత్సాహ గానము చేసెదము

 ఉత్సాహ గానము చేసెదము

ఘనపరచెదము మన యేసయ్య నామమును (2)
హల్లెలూయ యెహోవ రాఫా
హల్లెలూయ యెహోవ షమ్మా
హల్లెలూయ యెహోవ ఈరే
హల్లెలూయ యెహోవ షాలోమ్ (2)

1. అమూల్యములైన వాగ్ధానములు
అత్యధికముగా ఉన్నవి (2)
వాటిని మనము నమ్మినయెడల
దేవుని మహిమను ఆనుభవించెదము (2) ||హల్లెలూయ||

2. వాగ్ధాన దేశము పితరులకిచ్చిన
నమ్మదగిన దేవుడాయన (2)
జయించిన వారమై అర్హత పొంది
నూతన యెరుషలేం ఆనుభవించెదము (2) ||హల్లెలూయ||

Veenulaku Vindhulu - వీనులకు విందులు

 వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర

వేగిరమే వినుటకు రారండి
ఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి ||వీనులకు||

1. రండి… విన రారండి
యేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2)
నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి
మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2)
రండి… ||వీనులకు||

2. రండి… వచ్చి చూడండి
యేసయ్య చేసే కార్యములు చూడండి (2)
నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి
శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2)
రండి… ||వీనులకు||

3. సృష్టి కర్తను మరచావు నీవు
సృష్టిని నీవు పూజింప దగునా (2)
భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి
నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి (2)
రండి… ||వీనులకు||