Tuesday, February 25, 2025

ninu namminacho నిను నమ్మినచో సిగ్గుపడనీయవు lyrics

 నిను నమ్మినచో సిగ్గుపడనీయవు

నను నెమ్మదితో నీవే ఉంచెదవు
ఆపత్కాలమున నమ్ముకొనదగిన

అ.ప: యేసూ నీవే ఆధారము
యేసూ నీవే నా ప్రాణము

1.తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను
బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను

2. బలమును నమ్ముకొని భంగపడ్డాను
శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను

3. ధనమును నమ్ముకొని దగాపడ్డాను
సుఖసంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను

4. మనుష్యుల నమ్ముకొని మభ్యపడ్డాను
సత్యవంతుడా ఆశ్రయుడవని
నీ చెంతకు చేరాను

No comments: