Monday, March 3, 2025

Krupalanu Thalanchuchu - కృపలను తలంచుచు

 కృపలను తలంచుచు (2)

ఆయుష్కాలమంతా ప్రభుని
కృతజ్ఞతతో స్తుతింతున్ (2) ||కృపలను||

1.మిమ్మును ముట్టిన వాడు నా కంటిపాపను
ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం నన్ను  ||కృపలను||

2.రూపింపబడుచున్న ఏ ఆయుధం ఉండినను
నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం ప్రభువు  ||కృపలను||

3.కన్నీటి లోయలలో నే కృంగిన వేళలలో
నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు  ||కృపలను||

4.సర్వోన్నతుడైన నా దేవునితో చేరి
సతతము తన కృప వెల్లడి చేయ స్తుతులతో నింపెను – ఇలలో  ||కృపలను||

5.హల్లెలూయా ఆమెన్ నాకెంతో ఆనందమే
సీయోన్ నివాసము నాకెంతో ఆనందం ఆనందంమానందమే ఆమెన్ ||కృపలను||

Krupathappa verokati ledhayaa - కృపతప్ప వేరొకటి లేదయా

 కృపతప్ప వేరొకటి లేదయా

నీ కృపతప్ప వేరెవరు యేసయ్యా

కృపయే కదా నా ఆశ్రయము

నీ కృపయే కదా నా పరవశము


1. నిలువున రేగిన తుఫానులో

నడిపెను నిలిపెను నీ కృపయే ||2||

నా ఎడ చెలరేగె నీ కృపయే ||2||  ||కృప||


2. నీ కృప నన్ను విడువనిదీ

నీ కృపయే ఎడబాయనిది  ||2||

నిత్యము నిలుచును నీ కృపయే ||2||  ||కృప||


3. అణువణువునను నీ కృపయే

నా అడుగడుగునను నీ కృపయే  ||2||

నా యెడ కురిసేను నీ కృపయే ||2||  ||కృప||

Krupaye Neti Varaku - కృపయే నేటి వరకు

 కృపయే నేటి వరకు కాచెను

నా కృప నిన్ను విడువ దనినా ౹౹కృప౹౹

1. మనోనేత్రములు వెలిగించినందున - యేసు పిలిచిన పిలుపును
క్రీస్తు మహిమేశ్వర్య మెట్టిదో- పరిశుద్ధులలో చూపితివే  ౹౹కృపా ౹౹

2. జలములలో బడి వెళ్ళునపుడు - అలలవలె అవి పొంగి రాగా
అలల వలే నీ కృపతోడై - చేర్చెను నన్ను ఈ దరికి ౹౹కృపా ౹౹

3. భీకర రూపము దాల్చిన లోకము -మ్రింగుటకు నన్ను సమీపించగా
ఆశ్చర్యకరములు ఆదుకొని అందని కృపలో దాచెనుగా ౹౹కృపా౹౹

4. సేవార్థమైన వీణెలతో నేను - వీణెలు వాయించు వైణికులున్నా
సీయోను కొరకే జీవించుచూ- సీయోను రాజుతో హర్షించేదను ౹౹కృపా౹౹

5. నీదు వాక్యము - నా పాదములకు- నిత్యమైన వెలుగై యుండున్నా
కాలుజారె ననుకొనగా - నిలిపెను నన్ను నీ కృపయే ౹౹కృపా౹౹

Kurchundunu Nee Sannidhilo - కూర్చుందును నీ సన్నిధిలో

 


కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం
ధ్యానింతును నీ వాక్యమును – దేవా ప్రతి క్షణం (2)
నిరంతరం నీ నామమునే గానము చేసెదను
ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను ||కూర్చుందును||


ప్రతి విషయం నీకర్పించెదా
నీ చిత్తముకై నే వేచెదా (2)
నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా (2)
నీ నామమునే హెచ్చించెదా (2)
నా అతిశయము నీవే – నా ఆశ్రయము నీవే
నా ఆనందము నీవే – నా ఆధారము నీవే
యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును||


ప్రతి దినము నీ ముఖ కాంతితో
నా హృదయ దీపం వెలిగించెదా (2)
నీ వాక్యానుసారము జీవించెదా (2)
నీ ఘన కీర్తిని వివరించెదా (2)
నా దుర్గము నీవే – నా ధ్వజము నీవే
నా ధైర్యము నీవే – నా దర్శనం నీవే
యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును||

Lekkinchaleni Sthothramul - లెక్కించలేని స్తోత్రముల్

 లెక్కించలేని స్తోత్రముల్

దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ ||2||
ఇంత వరకు నా బ్రతుకులో ||2||
నువ్వు చేసిన మేళ్ళకై        || లెక్కించలేని ||

1. ఆకాశ మహాకాశముల్
వాటియందున్న సర్వంబును ||2||
భూమిలో కనబడునవన్ని ||2||
ప్రభువా నిన్నే కీర్తించున్           || లెక్కించలేని ||

2. అడవిలో నివసించువన్ని
సుడిగాలియు మంచును ||2||
భూమిపైనున్నవన్ని ||2||
దేవా నిన్నే పొగడును               || లెక్కించలేని ||

3. నీటిలో నివసించు ప్రాణుల్
ఈ భువిలోన జీవ రాసులు ||2||
ఆకాశామున ఎగురునవన్ని ||2||
ప్రభువా నిన్నే కీర్తించున్            || లెక్కించలేని ||

Maata ichi thappanivadavu - మాట ఇచ్చి తప్పనివాడవు

 మాట ఇచ్చి తప్పనివాడవు నీవే యేసయ్య

వేనోళ్ళ స్తుతించిన నీ ఋణము తీరదయ్య - 2
వాగ్దానాపూర్ణుడ దయగల నీ మాటలతో
ఇన్నాళ్లు ఇలలోనే బ్రతుకుచుంటిని -2

1. నీ మాటకునే విధేయుడనై
కుడివైపున వల విసిరిన వెంటనే - 2
విస్తారమైన దీవెనలతో నన్ను నింపితివే -2
నీ ఆజ్ఞల మార్గములో నడచి పొందెద ఇంకెన్నో మేలులు -2.      ||మాట||

2. నీ చిత్తమునే చేయుట కొరకే
ఉన్నత పిలుపుతో నన్ను పిలిచి - 2
విస్తారమైన ప్రజలకు దీవెనగా నిలిపితివే - 2
నీ పిలుపును కాపాడుకొనుచు నే సాగేద తుది శ్వాస వరకు - 2.       ||మాట||

3. నీ మాటకాదని ఎటుపోగలను
కంటికి ఎవరు కానరాని చీకటిలో -2
నను నడిపించుటకు ధ్రువతారగా నాలో వెలసితివే - 2
నీ కుడిచేతిలో తారగా వెలుగుచు ప్రకటించేదానిన్నే ప్రతి క్షణము - 2     ||మాట||

Madhuramainadi naa Yesu prema - మధురమైనది నా యేసు ప్రేమ

 మధురమైనది నా యేసు ప్రేమ

మరపురానిది నా తండ్రి ప్రేమ (2)
మరువలేనిది నా యేసుని ప్రేమ (2)
మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ

ప్రేమా… ప్రేమా…
ప్రేమా… నా యేసు ప్రేమా (2) ||మధురమైనది||


1. ఇహలోక ఆశలతో అంధుడ నేనైతిని
నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని (2)
చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి (2)
నీలో నను నిలిపిన నీ ప్రేమ మధురం ||ప్రేమా||


2. పర్వతములు తొలగినా మెట్టలు గతి తప్పినా
ఎగసి పడే అలలతో కడలే గర్జించినా (2)
మరణపు ఛాయలే దరి చేరనీయక (2)
కౌగిట దాచిన నీ ప్రేమ మధురం ||ప్రేమా||


3. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి
మార్గమును చూపి మన్నించితివి (2)
మరణపు ముల్లును విరచిన దేవా (2)
జీవము నొసగిన నీ ప్రేమ మధురం ||ప్రేమా||

Madhilona Nee Roopam - మదిలోన నీ రూపం

 మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం – ప్రతిఫలింపజేయునే ఎన్నడూ ||2||

కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యం
వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను
నీ సాటిలేరు ఇలలో అద్వితీయుడా          || మదిలోన నీ ||

1. ప్రతి గెలుపు బాటలోన – చైతన్య స్పూర్తి నీవై – నడిపించుచున్న నేర్పరి
అలుపెరగని పోరాటాలే – ఊహించని ఉప్పెనలై – నను నిలువనీయని వేళలో
హృదయాన కొలువైయున్న- ఇశ్రాయేలు దైవమా  
జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై…
తడికన్నులనే తుడిచిన నేస్తం – ఇలలో నీవేకదా…. యేసయ్యా … ||మదిలోన నీ||

2. నిరంతరం నీ సన్నిధిలో – నీ అడుగుజాడలోనే – సంకల్పదీక్షతో సాగేదా
నీతో సహజీవనమే – అధ్యాతిక పరవశమై – ఆశయాలదిశగా నడిపెనే
నీ నిత్య ఆదరణే – అన్నిటిలో నెమ్మదినిచ్చి
నా భారమంతా తీర్చి – నా సేదదీర్చితివి
నీ ఆత్మతో ముద్రించితివి – నీ కొరకు సాక్షిగా…  యేసయ్యా…  || మదిలోన నీ ||

3. విశ్వమంతా ఆరాధించే – స్వర్ణరాజ్య నిర్మాతవు – స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము
శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు – ఆ ఘడియ వరకు విడువకు
నేవేచియున్నాను నీ రాకకోసమే – శ్రేష్ఠమైన స్వాస్థ్యము కోసం సిద్ధపరచుమా….
నా ఊహలలో ఆశలసౌధం ఇలలో నీవేనయ్యా….. యేసయ్యా….     || మదిలోన నీ ||

Mahaaganudavu Mahonnathudavu - మహాఘనుడవు మహోన్నతుడవు

 మహాఘనుడవు మహోన్నతుడవు

పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు (2)
కృపా సత్య సంపూర్ణమై
మా మధ్యలో నివసించుట న్యాయమా
నను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా (2)


1. వినయముగల వారిని
తగిన సమయములో హెచ్చించువాడవని (2)
నీవు వాడు పాత్రనై నేనుండుటకై
నిలిచియుందును పవిత్రతతో (2)
హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2)    ||మహా||


2. దీన మనస్సు గలవారికే
సమృద్ధిగా కృపను దయచేయువాడవని (2)
నీ సముఖములో సజీవ సాక్షినై
కాపాడుకొందును మెళకువతో (2)
హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2)    ||మహా||


3. శోధింపబడు వారికి
మార్గము చూపించి తప్పించువాడవని (2)
నా సిలువ మోయుచు నీ సిలువ నీడను
విశ్రమింతును అంతము వరకు (2)
హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2)    ||మహా||

Mahaamahimatho Nindina - మహామహిమతో నిండిన

 మహామహిమతో నిండిన కృపా సత్యసంపూర్ణుడా

ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీనుడా యేసయ్యా
నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్య

1. మహిమను విడిచి భువిపైకి దిగివచ్చి - కరుణతో నను పిలిచి
సత్యమును బోధించి  చీకటిని తొలగించి - వెలుగుతో నింపితివి  ||2||
సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక
స్థిరపరచి నీ కృపాలో నడిపించువాడవు    ||2||  ||మహామహిమతో||

2. కరములుచాచి జలరాసులలోనుండి - నను లేవనెత్తితివి
క్షేమమును దయచేసి నను వెంబడించి అనుదినము  కాచితివి  ||2||
అక్షయుడా ప్రేమనుచూపి ఆదరించినావు
నిర్మాలుడా భాహువు చాపి దీవించువాడవు     ||2|| ||మహామహిమతో ||

3. పదివేలలోన గుర్తించదగిన - సుందరుడవు నీవు
అపరంజి పాదములు అగ్ని నేత్రములు - కలిగిన వాడవు  ||2||
ఉన్నతుడా - మహోన్నతుడా ఆరాధించెదను
రక్షకుడా - ప్రభాకరుడా నిను ఆరాధించెదను  ||2||   ||మహామహిమతో ||

Mahima Swaroopuda - మహిమ స్వరూపుడా

 మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా

మరణపుముల్లును విరిచినవాడా
నీకే స్తోత్రములు నా యేసయ్యా
నీకే స్తోత్రములు ||2||

1. నీ రక్తమును నా రక్షణకై
బలియాగముగా అర్పించినావు
నీ గాయములద్వారా స్వస్థతనొంది
అనందించెద నీలో నేను ||2||  ||మహిమ స్వరూపుడా||

2. విరిగిన మనస్సు నలిగినా హృదయం
నీ కిష్టమైన బలియాగముగా
నీ చేతితోనే విరిచిన రోట్టెనై
ఆహారమౌదును అనేకులకు ||2||  ||మహిమ స్వరూపుడా||

3. పరిశుద్ధత్మ ఫలముపొంది
పరిపూర్ణమైన జ్యేష్టుల సంఘమై
సీయోను రాజా నీ ముఖము చూడ
ఆశతో నేను వేచియున్నాను ||2|| ||మహిమ స్వరూపుడా||

Mahonthuda Nee Krupalo - మహోన్నతుడా నీ కృపలో

 మహోన్నతుడా

నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతై యున్నది
మహోన్నతుడా
నీ కృపలో నేను నివసించుట ||2||             ||మహోన్నతుడా||

1. మోడుబారిన జీవితాలను
చిగురింప జేయగలవు నీవు ||2||  
మారా అనుభవం మధురముగా
మార్చగలవు నీవు ||2||               ||మహోన్నతుడా||

2. ఆకు వాడక ఆత్మ ఫలములు
ఆనందముతో ఫలియించినా ||2||  
జీవ జలముల ఊట అయిన
నీ ఓరన నను నాటితివా ||2||        ||మహోన్నతుడా||

3. వాడబారని స్వాస్థ్యము నాకై
పరమందు దాచి యుంచితివా ||2||  
వాగ్ధాన ఫలము అనుభవింప
నీ కృపలో నన్ను పిలచితివా ||2||    ||మహోన్నతుడా||

Manakai Yesu Maraninche - మనకై యేసు మరణించె

 మనకై యేసు మరణించె మన పాపముల కొరకై

నిత్యజీవితము నిచ్చుటకే సత్యుండు సజీవుడాయె

1. తృణీకరింపబడె విసర్జింపబడెను
దుఃఖా క్రాంతుడాయె వ్యసనముల భరించెను ||మనకై యేసు||

2. మన వ్యసనముల వహించెన్ - మన దుఃఖముల భరించెన్
మన మెన్నిక చేయకయే - మన ముఖముల ద్రిప్పితిమి  ||మనకై యేసు||

3. మన యతిక్రమముల కొరకు - మన దోషముల కొరకు
మన నాథుడు శిక్షనొందె - మనకు స్వస్థత కలిగె  ||మనకై యేసు||

4. గొర్రెలవలె తప్పితిమి - పరుగిడితిమి మనదారిన్
అరుదెంచె కాపరియై - అర్పించి ప్రాణమును  ||మనకై యేసు||

5. దౌర్జన్యము నొందెను - బాధింపబడెను
తననోరు తెరువలేదు - మనకై క్రయధనమీయన్  ||మనకై యేసు||

6. ఎదిరింప లేదెవరిన్ - లేదే కపటము నోట
యెహోవా నలుగగొట్టెన్ - మహావ్యాధిని కలిగించెన్  ||మనకై యేసు||

7. సిలువలో వ్రేలాడెన్ - సమాధిలో నుండెను
సజీవుండై లేచెన్ - స్తోత్రము హల్లెలూయ  ||మనకై యేసు||

Gadachina kaalamu - గడచిన కాలము

 హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2)


గడచిన కాలము కృపలో మమ్ము
దాచిన దేవా నీకే స్తోత్రము
పగలూ రేయి కనుపాపవలె
కాచిన దేవా నీకే స్తోత్రము (2)
మము దాచిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన||

1. కలత చెందిన కష్టకాలమున
కన్న తండ్రివై నను ఆదరించిన
కలుషము నాలో కానవచ్చినా
కాదనక నను కరుణించిన (2)
కరుణించిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన||

2. లోపములెన్నో దాగి ఉన్నను
ధాతృత్వముతో నను నడిపించినా
అవిధేయతలే ఆవరించినా
దీవెనలెన్నో దయచేసిన (2)
దీవించిన దేవా నీకే స్తోత్రము
దయచూపిన తండ్రి నీకే స్తోత్రము (2) ||గడచిన||

Ganamainavi nee kaaryamulu - ఘనమైనవి నీ కార్యములు

 ఘనమైనవి నీ కార్యములు నా యెడల

స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2)
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
స్తుతులర్పించెదను అన్నివేళలా (2)
అనుదినము నీ అనుగ్రహమే
ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి||

1. యే తెగులు సమీపించనీయక – యే కీడైన దరిచేరనీయక
ఆపదలన్ని తొలగే వరకు – ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2)
నా భారము మోసి – బాసటగా నిలిచి – ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము ||ఘనమైనవి||

2. నాకు ఎత్తైన కోటవు నీవే – నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే – శాశ్వత కృపకాధారము నీవే (2)
నా ప్రతిక్షణమును నీవు – దీవెనగా మార్చి – నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము ||ఘనమైనవి||

3. నీ కృప తప్ప వేరొకటి లేదయా – నీ మనసులో నేనుంటే చాలయా
బహు కాలముగా నేనున్న స్థితిలో – నీ కృప నా యెడ చాలునంటివే (2)
నీ అరచేతిలో నను – చెక్కుకుంటివి – నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||

Goppa Devudavani - గొప్ప దేవుడవని

 గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని

గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్
రాజుల రాజువని రక్షణ దుర్గమని
నీ కీర్తిని నేను కొనియాడెదన్

హల్లెలూయా నా యేసునాథా
హల్లెలూయా నా ప్రాణనాథా (2).    ||గొప్ప||

1. అద్భుత క్రియలు చేయువాడని
ఆశ్చర్య కార్యాలు చేయగలడని (2)
అద్వితీయుడవని ఆదిసంభూతుడని
ఆరాధించెద నిత్యం నిన్ను (2)      ||హల్లెలూయా||

2. సాగరాన్ని రెండుగా చేసినాడని
సాతాను శక్తులను ముంచినాడని (2)
సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని
సాక్ష్య గీతం నే పాడెదన్ (2)       ||హల్లెలూయా||

Innelugaa Kanniru thudichi - ఇన్నేళ్లుగా కన్నీరు తుడిచి

 ఇన్నేళ్లుగా కన్నీరు తుడిచి - కాపాడిన ఓ ప్రభువా ||2||

శోధన సమయములోనా... వేదన కాలములోనా ... ||2||

1. జడివానలూ సుడిగాలులూ - కురిసాయి నా బ్రతుకులోనా ||2||
నా చెంత చెరీ , చేయూత నిచ్చి ||2||
కాపాడిన ఓ ప్రభువా ,
మమ్ము  కాపాడిన ఓ ప్రభువా ||ఇన్నేళ్లుగా||

2. నా వారలే వెలివేసిన - పగవారు తలలూచినా ||2||
నీ దరికీ చేర్చి, ఓదార్పు నిచ్చి ||2||
ననాదరించవు ప్రభువా,
నీవు ననాదరించవు ప్రభువా  ||ఇన్నేళ్లుగా||

3. సాతానుడు శోదించగా - నా దేవ జయమిచ్చినావూ ||2||
పలుమారులు ప్రార్ధించగా ||2||
పడకుండ కాపాడినావు,
నన్ను పడకుండ కాపాడినావు  ||ఇన్నేళ్లుగా||

Intha kaalam Needu krupalo - ఇంత కాలం నీదు కృపలో

 ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా ||2||

ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ||2||         ||ఇంత కాలం||

1. ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా ||2||
మారని వీడని ప్రేమే నీదయ్యా
మార్చిన నా జీవితం నీకే యేసయ్యా ||2||         ||ఇంత కాలం||

2. నీవు చేసిన మేలులు – తలచుకుందును అనుదినం ||2||
నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా ||2||           ||ఇంత కాలం||

3. దూరమైతిరి ఆప్తులు – విడచిపోతిరి నా హితులు ||2||
శోధన వేదన తీర్చిన యేసయ్యా
తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా ||2||           ||ఇంత కాలం||

Jeevapradhaathavu - జీవప్రధాతవు

 జీవప్రధాతవు నను రూపించిన శిల్పివి నీవే ప్రభు

జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు
జగములనేలే మహిమాన్వితుడా నా యెడ నీ కృపను
జాలీ హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను
ఏమని పాడెధాను ఏమని పొగడెధను

1.శుభకరమైన తొలిప్రేమను నే - మరువక జీవింప కృప నీయవా
కోవెలలో నీ కానుక నేనై - కోరికలో నీ వేడుక నీవై
జత కలసి నిలిచి జీవింపదలచి - కార్చితివి నీ రుధిరమే
నీ తాగఫలితం నీ ప్రేమమధురం - నాసొంతమే యేసయ్య  ||జీవప్రధాతవు||

2.నేనేమైయున్న నీ కృపా కదా - నాతో నీ సన్నిధి పంపవా
ప్రతికులతలు శృతిమించినాను - సంధ్యాకాంతులు నిదురించినాను
తొలివెలుగు నీవై ఉదయించినాపై - నడిపించినది నీవయ్యా
నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి - బలపరచినా యేసయ్య  ||జీవప్రధాతవు||

3.మహిమను ధరించినయోధులతో కలసి - దిగివచ్చేదవు నాకోసమే
వేల్పులలోన బహుఘనుడవు నీవు - విజయవిహారుల ఆరాధ్యుడవు
విజయోత్సవముతో ఆరాధించెను - అభిషక్తుడవు నీవని
ఏనాడు పొందని ఆత్మాభిషేకముతో - నింపుము నా యేసయ్య  ||జీవప్రధాతవు||

Baasillenu Siluvalo Paapakshama - భాసిల్లెను సిలువలో పాపక్షమా

 భాసిల్లెను సిలువలో పాపక్షమా

యేసు ప్రభూ నీ దివ్య క్షమా      ||భాసిల్లెను||

1. కలువరిలో నా పాపము పొంచి
సిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహరా కరుణించితివి (2)      ||భాసిల్లెను||

2. దోషము చేసినది నేనెకదా
మోసముతో బ్రతికిన నేనెకదా
మోసితివా నా శాపభారం (2)     ||భాసిల్లెను||

3. పాపము చేసి గడించితి మరణం
శాపమెగా నేనార్జించినది
కాపరివై నను బ్రోచితివి (2)     ||భాసిల్లెను||

4. ఎందులకో నాపై ఈ ప్రేమ
అందదయ్యా స్వామీ నా మదికి
అందులకే భయమొందితిని (2)     ||భాసిల్లెను||

5. నీ మరణపు వేదన వృధా గాదు
నా మది నీ వేదనలో మునిగెను
క్షేమము కలిగెను హృదయములో (2)     ||భాసిల్లెను||

6. నమ్మిన వారిని కాదన వనియు
నెమ్మది నొసగెడి నా ప్రభుడవని
నమ్మితి నీ పాదంబులను (2)      ||భాసిల్లెను||

Bethlehemulo Sandhadi - బెత్లెహేములో సందడి

 బెత్లెహేములో సందడి

పశుల పాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడని
మహారాజు పుట్టాడని (2)       ||బెత్లెహేములో||

1. ఆకాశములో సందడి
చుక్కలలో సందడి (2)
వెలుగులతో సందడి
మిల మిల మెరిసే సందడి (2)       ||బెత్లెహేములో||

2. దూతల పాటలతో సందడి
సమాధాన వార్తతో సందడి (2)
గొల్లల పరుగులతో సందడి
క్రిస్మస్ పాటలతో సందడి (2)       ||బెత్లెహేములో||

3. దావీదు పురములో సందడి
రక్షకుని వార్తతో సందడి (2)
జ్ఞానుల రాకతో సందడి
లోకమంతా సందడి (2)       ||బెత్లెహేములో||