Wednesday, March 5, 2025

Krupa Krupa Sajeevulatho - కృపా కృపా సజీవులతో

 కృపా - కృపా సజీవులతో

నను నిలిపినది నీ కృపా (2)
నా శ్రమదినమున నాతో నిలిచి
నను ఓదార్చిన నవ్యకృప నీదు కృప (2)

కృపా సాగర మహోనాతమైన
నీ కృపా చాలుయా || కృపా||

1. శాశ్వతమైన నీ ప్రేమతో - నను ప్రేమించిన శ్రీకరుడా
నమ్మకమైన నీ సాక్షినై నే - నీ దివ్య సన్నిధిలో నన్నొదిగిపోని (2)
నీ ఉపదేశమే నాలో ఫలబరితమై - నీ కమనియ కాంతులను విరజిమ్మెనే (2)
నీ మహిమను ప్రకటింప - నను నిలిపేనే || కృపా||

2. గాలితుఫానుల అలజడితో - గూడుచెదరిన గువ్వవలే
గమ్యమును చూపే నిను వేడుకొనగా - నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి (2)
నీ వాత్యల్యమే నవ వసంతము - నా జీవిత దినములు ఆద్యంతము (2)
ఒక్క క్షణమైన విడువని ప్రేమామృతము ||కృపా||

3. అత్యునతమైన కృపలతో - ఆత్మఫలము సంపదలతో
అతిశ్రేష్టమైన స్వాస్త్యమును పొంది - నీ ప్రేమ రాజ్యములో హర్షించువేళ (2)
నా హృదయార్పణ నిను మురిపించని - నీ రుణాతిశయములను కీర్తించని (2)
ఈ నీరీక్షణ నాలో నేరవని || కృపా||

Krupaa kshemamu - కృపా క్షేమము

 కృపా క్షేమము నీ శాశ్వత జీవము

నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు (2)
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా


1. నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
లెక్కకు మించిన దీవెనలైనాయి (2)
అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను (2)
నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే ||కృపా క్షేమము||


2. నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి (2)
కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే
గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను (2)
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే ||కృపా క్షేమము||


3. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
నా హృది నీ కొరకు పదిలపరచితిని (2)
బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా
అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా (2)
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే ||కృపా క్షేమము||

Krupaa Sathya Sampoornuda - కృపా సత్య సంపూర్ణుడా

 కృపా సత్య సంపూర్ణుడా

సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా ||2||
నా సన్మానానికే మహనీయుడవు నీవేనయా ...
మహనీయుడవు నీవేనయా ...

1. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా
దాటిరే నీ జనులు బహు క్షేమముగా ||2||
ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే ||2||     ||కృపా||

2. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయ్యగా
నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా ||2||
నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే ||2||     ||కృపా||

3. నైవేద్యములు, దహన బలులు నీవు కోరవుగా
నా ప్రాణాత్మ శరీరము బలిఅర్పణ కాగా ||2||
నా జిహ్వబలులు, స్తోత్ర బలులుగ  మారిపోయెనే ||2||     ||కృపా||