Tuesday, February 25, 2025

junte thene dharalakanna yesu namam జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధుర lyrics

 జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం

యేసయ్యా సన్నిధినే మరువజాలను
జీవిత కాలమంతా ఆనదించెదాయేసయ్యనే ఆరాధించెదా

1. యేసయ్య నామమే బహు పూజ్యనీయము
నాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి
నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే

2. యేసయ్య నామమే బలమైన ధుర్గము
నాతోడై నిలచి క్షేమముగా నను దాచి
నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే

3. యేసయ్య నామమే పరిమళ తైలము
నాలో నివసించె సువాసనగా నను మార్చె
నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే

No comments: