Thursday, March 6, 2025

Nammakamaina Naa Prabhu - నమ్మకమైన నా ప్రభు

 నమ్మకమైన నా ప్రభు

నిన్ను నే స్తుతింతును – నిన్ను నే స్తుతింతును    || నమ్మకమైన ||

1. కరుణతోడ పిల్చియు – స్థిరపరచి కాపాడిన
స్థిరపరచి కాపాడిన
స్థిరపరచిన నా ప్రభున్
పొగడి నే స్తుతింతును ||2||        || నమ్మకమైన ||

2. ఎన్నో సార్లు నీ కృపన్ – విడచియుంటినో ప్రభు
విడచియుంటినో ప్రభు
మన్ననతోడ నీ దరిన్
చేర్చి నన్ క్షమించితివి (2)       || నమ్మకమైన ||

3. కృంగియుండు వేళలో – పైకి లేవనెత్తితివి
పైకి లేవనెత్తితివి
భంగ పర్చు సైతానున్
గెల్చి విజయమిచ్చితివి (2)        || నమ్మకమైన ||

4. నా కాశ్రయశైలమై – కోటగా నీవుంటివి
కోటగా నీవుంటివి
ప్రాకారంపు ఇంటివై
నన్ను దాచియుంటివి (2)          || నమ్మకమైన ||

5. సత్య సాక్షివై యుండి – నమ్మదగినవాడవై
నమ్మదగినవాడవై
నిత్యుడౌ మా దేవుడా
ఆమేనంచు పాడెద (2)            || నమ్మకమైన ||

Nannenthaga Preminchithivo - నన్నెంతగా ప్రేమించితివో

 నన్నెంతగా ప్రేమించితివో

నిన్నంతగా దూషించితినో
నన్నెంతగా నీవెరిగితివో
నిన్నంతగా నే మరచితినో
గలనా – నే చెప్పగలనా
దాయనా – నే దాయగలనా (2)
అయ్యా… నా యేసయ్యా
నాదం – తాళం – రాగం
ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము (2)

ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో
ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో (2)
ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో
ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో (2) ||గలనా||

ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో
ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో (2)
ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో
ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో (2) ||గలనా||

Nazareyuda Naa Yesayya - నజరేయుడా నా యేసయ్య

 నజరేయుడా నా యేసయ్య

ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని
గళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా||

1. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2)
శూన్యములో ఈ భూమిని
వ్రేలాడదీసిన నా యేసయ్య (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||

2. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2)
జలములలోబడి నే వెళ్ళినా
నన్నేమి చేయవు నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||

3. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2)
సీయోనులో నిను చూడాలని
ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||

Nee Baahubalamu Ennadaina - నీ బాహుబలము ఎన్నడైన

 నీ బాహుబలము ఎన్నడైన దూరమాయెనా

నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎపుడైనా మూగబోయెనా ||2||
నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి
యేసయ్య అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ ||2||     || నీ బాహుబలము ||


1. ఇంత గొప్ప రక్షణ కోటలో నను నిలిపితివి
దహించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పించితివి ||2||
అవమానించినవారే అభిమానమును పంచగా
ఆనంద సంకేతమే ఈ రక్షణ గీతం ||2||     || నీ బాహుబలము ||


2. సారవంతమైన తోటలో నను నాటితివి
సర్వాదికారిగా తోడై రోగ మరణ భీతినే తొలగించితివి ||2||
చీకటి కమ్మిన మబ్బులే కురిసెను దీవెన వర్షమై
ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును ||2||     || నీ బాహుబలము ||


3. వీశ్వాస వీరుల జాడలో నను నడిపించుచూ
పుటము వేసి యున్నావు సంపూర్ణ పరిశుద్ధత నేనొందుటకు ||2||
శ్రమనొందిన యేండ్ల కొలది సమృద్ధిని నాకిచ్చెదవు
గొప్ప సాక్షి సంఘమై సిలువను ప్రకటింతును ||2||     || నీ బాహుబలము ||

Nee Krupa leni Kshanamu - నీ కృప లేని క్షణము

 యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా

నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా

నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము

నేనూహించలేను యేసయ్యా (2)

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా

నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2)    ||నీ కృప||

మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి

మార్గముగా మారి మనిషిగా మార్చావు

మహిని నీవు మాధుర్యముగా మార్చి

మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2)

మహిమలో నేను మహిమను పొంద

మహిమగా మార్చింది నీ కృప (2)     ||యేసయ్యా||


ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి

ఆపత్కాలమున ఆదుకొన్నావు

ఆత్మీయులతో ఆనందింప చేసి

ఆనంద తైలముతో అభిషేకించావు (2)

ఆశ తీర ఆరాధన చేసే

అదృష్టమిచ్చింది నీ కృప (2)     ||యేసయ్యా||

Nee krupa naaku chalunu - నీ కృప నాకు చాలును.

 నీ కృప నాకు చాలును

నీ కృప లేనిదే నే బ్రతుకలేను ||2||
నీ కృప లేనిదే నే బ్రతుకలేను

1. జల రాసులన్ని ఏక రాసిగా
నిలిచిపోయెనే నీ జనుల ఎదుట ||2||
అవి భూకంపాలే అయినా
పెను తుఫానులే అయినా ||2||
నీ కృపయే శాశించునా
అవి అణగిపోవునా ||2||        ||నీ కృప||

2. జగదుద్పత్తికి ముందుగానే
ఏర్పరచుకొని నన్ను పిలచితివా ||2||
నీ పిలుపే స్థిరపరచెనే
నీ కృపయే బలపరచెనే ||2||
నీ కృపయే ఈ పరిచర్యను
నాకు అనుగ్రహించెను ||2||      ||నీ కృప||

Nee Krupa Nithyamundunu - నీ కృప నిత్యముండును

 నీ కృప నిత్యముండును

నీ కృప నిత్య జీవము
నీ కృప వివరింప నా తరమా యేసయ్యా ||2||
నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది
రక్షణ సంగీత సునాదము ||2||        ||నీ కృప||

1. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె
కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు ||2||
కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా ||2||        ||నీ కృప||

2. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె
ప్రతి క్షణమున నీవు పలుకరించావు ||2||
ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే ||2||        ||నీ కృప||

3. అనుభవ అనురాగం కలకాలమున్నట్లె
నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు ||2||
రాజమార్గములో నను నడుపుచున్న రారాజువు నీవేగా ||2||        ||నీ కృప||

Nee Mukamu Manoharamu - నీ ముఖము మనోహరము

 నీ ముఖము మనోహరము

నీ స్వరము మాధుర్యము
నీ పాదాలు అపరంజి మయము

యేసయ్యా నా ప్రాణ ప్రియుడా
మనగలనా నిను వీడి క్షణమైన

1. నీవే నాతోడువై నీవే నాజీవమై
నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై
అణువణువున నీకృప నిక్షిప్తమై
నను ఎన్నడు వీడని అనుబంధమై ||యేసయ్య||


2. నీవే నా శైలమై నీవే నాశృంగమై
నా విజయానికే నీవు భుజబలమై
అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై
నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు ||యేసయ్య||

3. నీవే వెలుగువై నీవే ఆలయమై
నా నిత్యత్వమునకు ఆద్యంతమై
అమరలోకాన శుద్ధులతో పరిచయమై
నను మైమరచి నేనేమి చేసేదనో ||యేసయ్య||

Nee Prema naalo - నీ ప్రేమ నాలో

 నీ ప్రేమ నాలో మధురమైనది

అది నా ఊహకందని క్షేమ శిఖరము ||2||
ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను
పరవశించి నాలో మహిమపరతు నిన్నే
సర్వకృపానిధి నీవు – సర్వాధికారివి నీవు
సత్య స్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే        ||నీ ప్రేమ||

1. చేరితి నిన్నే విరిగిన మనస్సుతో
కాదనలేదే నా మనవులు నీవు ||2||
హృదయము నిండిన గానం – నను నడిపే ప్రేమ కావ్యం
నిరతము నాలో నీవే – చెరగని దివ్య రూపం ||2||
ఇది నీ బాహు బంధాల అనుబంధమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే ||2||         ||నీ ప్రేమ||

2. నా ప్రతి పదములో జీవము నీవే
నా ప్రతి అడుగులో విజయము నీవే ||2||
ఎన్నడు విడువని ప్రేమ – నిను చేరే క్షణము రాదా
నీడగా నాతో నిలిచే – నీ కృపయే నాకు చాలును ||2||
ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే ||2||         ||నీ ప్రేమ||

3. నీ సింహాసనము నను చేర్చుటకు
సిలువను మోయుట నేర్పించితివి ||2||
కొండలు లోయలు దాటే – మహిమాత్మతో నింపినావు
దయగల ఆత్మతో నింపి – సమాభూమిపై నడిపినావు ||2||
ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే ||2||         ||నీ ప్రేమ||

Nee Premakai Vandanam Yesayya - నీ ప్రేమకై వందనం యేసయ్య

 నీ ప్రేమకై వందనం యేసయ్య

నీ కృపలకై వందనంయేసయ్య

పాపినైనా నన్ను ఎంతో ప్రేమించావు

నీ రక్తముతో కడిగి నన్ను క్షమియించావు

ఆశ్చర్యకారుడా ఆలోచనాకర్త బలవంతుడా

నిత్యుడగుతండ్రి సమాధానకర్త

1. ఈ లోకంలో నాకు ఆదరణలేనప్పుడు

ఆదరించింది నీ ప్రేమయేకదా - 2

తండ్రివి నీవే - తల్లివి నీవే

ఆదియు నీవే - అంతము నీవే - 2

2. శాంతిసమాధానము నా యందు లేనపుడు

నీ వాక్యమే నాకు - శాంతినిచ్ఛేగా - 2

నీవే మార్గము - నీవే సత్యము

నీవే జీవము - నీవే సర్వము - 2

3. నేను వేళ్ళు మార్గములో - నేను చేయు పనులలో

తోడునీడగా ఉన్నది - నీవేగదా - 2

హల్లేలూయాని - ఆరాధించెదం

నీ సన్నిధిలో - సంతోషమే - 2

4. మా నిస్సి సంఘములో - దినదినం అభివృద్ధి

ఆయురారోగ్యములతో - దీవించు యేసయ్య - 2

బలవంతుడా - అభిషక్తుడా

ఆదిసంభూతుడా - నా యేసయ్య - 2

Neethi Nyayamulu - నీతి న్యాయములు

 నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా

నిత్య జీవార్థమైనవి నీ శాసనములు ||2||    
వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా
నీ ప్రియమైన స్వాస్థ్యమును
రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను
నీ రాజ్య దండముతో|| నీతి ||

1. ప్రతి వాగ్ధానము నా కొరకేనని
ప్రతి స్థలమందు – నా తోడై కాపాడుచున్నావు నీవు ||2||    
నిత్యమైన కృపతో నను బలపరచి
ఘనతను దీర్గాయువును దయచేయువాడవు ||2||    || నీతి ||

2. పరిమళ వాసనగ నేనుండుటకు
పరిశుద్ధ తైలముతో – నన్నభిషేకించి యున్నావు నీవు ||2||    
ప్రగతి పథములో నను నడిపించి
ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు ||2||    || నీతి ||

3. నిత్య సీయోనులో నీతో నిలుచుటకు
నిత్య నిబంధనను – నాతో స్థిరపరచుచున్నావు నీవు ||2||    
మహిమ కలిగిన పాత్రగ ఉండుటకు
ప్రజ్ఞ వివేకములతో నను నింపువాడవు ||2||

Neetho Naa Jeevitham - నీతో నా జీవితం

 నీతో నా జీవితం సంతోషమే

నీతో నా అనుబంధం మాధుర్యమే (2)
నా యేసయ్యా కృప చూపుచున్నావు – వాత్సల్యపూర్ణుడవై
నా యేసయ్యా నడిపించుచున్నావు – స్ఫూర్తిప్రదాతవై
ఆరాధ్యుడా యేసయ్యా…
నీతో నా అనుబంధం మాధుర్యమే


భీకర ధ్వనిగలా మార్గమునందు
నను స్నేహించిన నా ప్రియుడవు నీవు (2)
కలనైన మరువను నీవు నడిపిన మార్గం
క్షణమైన విడువను నీతో సహవాసం (2) ||ఆరాధ్యుడా||


సంతోషమందైనా శ్రమలయందైనను
నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే (2)
నిత్యమైన మహిమలో నను నిలుపుటకు
శుద్ధ సువర్ణముగా నను మార్చుచున్నావు (2) ||ఆరాధ్యుడా||


ఆకాశమందుండి ఆశీర్వదించితివి
అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని (2)
నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు
నూతన కృపలతో నను నింపుచున్నావు (2) ||నీతో నా||

Neetho Gadipe Prathikshanamu - నీతో గడిపే ప్రతి క్షణము

 నీతో గడిపే ప్రతి క్షణము

ఆనంద బాష్పాలు ఆగవయ్యా ||2||
కృప తలంచగా మేళ్లు యోచించగా ||2||
నా గలమాగదు స్తుతించక – నిను కీర్తించక
యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా ||4||        ||నీతో||

1. మారా వంటి నా జీవితాన్ని
మధురముగా మార్చి ఘనపరచినావు ||2||
నా ప్రేమ చేత కాదు
నీవే నను ప్రేమించి ||2||
రక్తాన్ని చిందించి
నన్ను రక్షించావు ||2||         ||యేసయ్యా||

2. గమ్యమే లేని ఓ బాటసారిని
నీతో ఉన్నాను భయము లేదన్నావు ||2||
నా శక్తి చేత కాదు
నీ ఆత్మ ద్వారానే ||2||
వాగ్ధానము నెరవేర్చి
వారసుని చేసావు ||2||         ||యేసయ్యా||

Neeti Vaagula Koraku - నీటి వాగుల కొరకు

 నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు

నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది ||2||

నా ప్రాణమా నా సమస్తమా - ప్రభుని స్తుతియించుమా

నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా ||2||

నా ప్రాణమా నా సమస్తమా

1. పనికిరాని నను నీవు పైకి లేపితివి

క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి ||2||

నా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివి

నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు

నే వెంబడింతు ప్రభు                                            ॥ నా ప్రాణమా ॥

2. అంధకారపు లోయలలో నేను నడచితిని

ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి ||2||

కంటి పాపగ నీవు నన్ను కాచితివి

కన్నతండ్రివి నీవని నిన్ను కొలచెదను

ఇలలో నిన్ను కొలచెదను                                        ॥ నా ప్రాణమా ॥

3. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు

ఆత్మా ఫలములు దండిగా నీకై ఫలియింతును ||2||

నీవు చేసిన మేళ్లను నేనెట్లు మరతు ప్రభు

నీ కొరకు నే సాక్షిగ ఇలలో జీవింతును

నే ఇలలో జీవింతును                                               ॥ నా ప్రాణమా ॥

Neeve naa santosha gaanamu - నీవే నా సంతోషగానము

 నీవే నా సంతోషగానము

రక్షణశృంగము మహాశైలము (2)
బలశూరుడా యేసయ్యా నా తోడై
ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2) ||నీవే నా||

1. త్యాగము ఎరుగని స్నేహమందు
క్షేమము కరువై యుండగా
నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి
నీ ప్రేమతో నన్నాకర్షించినావు (2)
నిరంతరం నిలుచును నాపై నీ కనికరం
శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో (2) ||నీవే నా||

2. వేదన కలిగిన దేశమందు
వేకువ వెలుగై నిలిచినావు
విడువక తోడై అభివృద్ధిపరచి
ఐగుప్తులో సింహాసనమిచ్చినావు (2)
మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం
అనుదినం అనుక్షణం నీతో నా జీవితం (2) ||నీవే నా||

3. నిర్జీవమైన ఈ లోయయందు
జీవాధిపతివై వెలసినావు
హీనశరీరం మహిమ శరీరముగ
నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు (2)
హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు
హోసన్నా హోసన్నా నీవే మహరాజువు (2) ||నీవే నా||

Neevunte naaku chaalu Yesayya - నీవుంటే నాకు చాలు యేసయ్యా

 నీవుంటే నాకు చాలు యేసయ్యా

నీవెంటే నేను ఉంటానేసయ్యా (2)
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2) ||నీవుంటే||


1. ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ
ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2) ||నీ మాట||


2. బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ
అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2) ||నీ మాట||


3. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా
ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2) ||నీ మాట||


4. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేమియు కాదిల సమానము (2) ||నీ మాట||

Neevu Chesina Upakaaramulaku - నీవు చేసిన ఉపకారములకు

 నీవు చేసిన ఉపకారములకు

నేనేమి చెల్లింతును ||2||
ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా ||2|| ||నీవు చేసిన||

1. వేలాది నదులంత విస్తార తైలము
నీకిచ్చినా చాలునా ||2||
గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని
నీకిచ్చినా చాలునా ||2||                    ||ఏడాది||

2. మరణపాత్రుడనైయున్న నాకై
మరణించితివ సిలువలో ||2||
కరుణ చూపి నీ జీవ మార్గాన
నడిపించుమో యేసయ్యా ||2||            ||ఏడాది||

3. విరిగి నలిగిన బలి యాగముగను
నా హృదయ మర్పింతును ||2||
రక్షణ పాత్రను చేబూని నిత్యము
నిను వెంబడించెదను ||2||               ||ఏడాది||

4. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు
నీకేమి చెల్లింతును ||2||
కపట నటనాలు లేనట్టి హృదయాన్ని
అర్పించినా చాలునా ||2||                ||ఏడాది||

Nenaithe nee Mandiramandu - నేనైతే నీ మందిరమందు

 నేనైతే నీ మందిరమందు

హల్లెలూయా స్తుతి నే పాడుచు
పచ్చని ఒలీవనై వుందును

1. ఈ నూతన సంవత్సరమున
నన్ను నిలిపిన యేసయ్య స్తోత్రములు (2)
నాపై నీకున్న ప్రేమను చూపితివే (2)
కృతజ్ఞుడనై నీ సాక్షిగా జీవించెద (2)

2. నీ కృపవెంబడి కృపను పొందుచు
నీ పాదాల కడవదిగి ఉండెదను (2)
నీపై నాకున్న ప్రేమను తలపోయుచు (2)
నా మదిలో నిన్నే నిలిపి పూజింతును (2)

3. నీ ఆశ్చర్యకార్యములు ధ్యానించుచు
నేను ధైర్యముగా నీకొరకు జీవించెద (2)
నీకై శ్రమపడుట నాకు ఎంతో మేలాయెను (2)
నాకై నీవిచ్చే బహుమతిపై గురి నిలిపేదా (2)

Nenemaina Prabhuva - నేనేమైనా ప్రభువా

 నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను

నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను (2)
నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా (2)
నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా (2) ||నేనేమైనా||

1. లేక లేక వృద్ధాప్యమందు
ఏకైక కుమారుని ఇచ్చింది నీవే (2)
ఇచ్చిన నీవే బలి కోరగా (2)
తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా ||నేనేమైనా||

2. సర్వము పోయి శరీరము కుళ్ళిన
నా అనువారే వెలివేసినా (2)
ఆప్తులంతా శత్రువులైనా (2)
అంతము వరకు సహియించిన ఆ యోబులా ||నేనేమైనా||

3. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైనా అది నాకెంతో మేలే (2)
ఇదిగో నేను ఉన్నానయ్యా (2)
దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా ||నేనేమైనా||

Nenendukani Nee Soththugaa - నేనెందుకని నీ సొత్తుగా

 నేనెందుకని నీ సొత్తుగా మారితిని

యేసయ్యా నీ రక్తముచే – కడుగబడినందున  ||2||
నీ అనాది ప్రణాళికలో – హర్షించెను నా హృదయసీమ  ||2||

1. నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే
నీ సన్నిధిలో నీ పోందుకోరి – నీ స్నేహితుడనైతినే   ||2||
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును   ||2||         ||నేనె||

2. నీ శ్రమలలో – పాలొందుటయే – నా దర్శనమాయెనే
నా తనువందున – శ్రమలుసహించి- నీ వారసుడనైతినే
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును  ||2||            ||నేనె||

3. నీలో నేనుండుటే – నాలో నీవుండుటే – నా ఆత్మీయ అనుభవమే
పరిశుద్ధాత్ముని అభిషేకముతో – నే పరిపూర్ణత చేందెద  ||2||
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును    ||2||           ||నేనె||

Nenu Velle Maargamu - నేను వెళ్ళే మార్గము

 నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును

శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను ||2||     ||నేను||

1. కడలేని కడలి తీరము – ఎడమాయె కడకు నా బ్రతుకున ||2||
గురిలేని తరుణాన వెరువగ – నా దరినే నిలిచేవ నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ ||2||

2. జలములలోబడి నే వెళ్లినా – అవి నా మీద పారవు ||2||
అగ్నిలో నేను నడచినా – జ్వాలలు నను కాల్చజాలవు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ ||2||

3. విశ్వాస నావ సాగుచు – పయనించు సమయాన నా ప్రభు ||2||
సాతాను సుడిగాలి రేపగా – నా యెదుటే నిలిచేవా నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ ||2||         ||నేను||