Monday, March 3, 2025

Bajinthumu ninu Jagadeesa - భజియింతుము నిను జగదీశా

 భజియింతుము నిను జగదీశా శ్రీ

యేసా మా రక్షణ కర్తా (2)

శరణు శరణు మా దేవా యెహోవా

మహిమాన్విత చిర జీవనిధి (2)          ||భజియింతుము||

విమల సెరాపులు దూత గణంబులు

చూడగ లేని తేజోనిధివే (2)

మా యధములకై సిలువ మ్రానుపై

దీనుడవై మరణించితివే (2)           ||శరణు||

ప్రప్రధముడ మరి కడపటి వాడా

మృతుడై బ్రతికిన నిరత నివాసి (2)

నీ భజనలు మా జీవనాధారం

చేకొనవే మా స్తుతి గీతం (2)         ||శరణు||  

No comments: