చూచుచున్న దేవుడవు నీవే యేసయ్య
చూడముచ్చటాయెనే సుకుమార సుమములైననీ నేత్రాలంకృతము
1.పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో
క్షమించబడుదురు ఎవరైనా రక్తప్రోక్షణతో (2)
అప్యాయతకు నోచుకొనని నను చేరదీసిన కృపా సాగరా. (2) ||చూచుచున్న||
2.అగ్నిజాలామయమే నీ చూపులవలయాలు
తప్పించుకొందురా? ఏవరైన ఎంతటిఘనులైనా. (2)
అగ్ని వంటి శోధనను తప్పించితివవే దయాసాగరా. (2) ||చూచుచున్న||
No comments:
Post a Comment