అందరు నన్ను విడచిన
నీవు నన్ను విడవనంటివే (2)
నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్య… (2)
1. వ్యాధులు నన్ను చుట్టినా
బాధలు నన్ను ముట్టిన…. (2)
నా కొండవు నీవే, నా కోటాయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్య (2)
2. లోకము నన్ను విడచిన
నీవు నన్ను విడవనంటివే… (2)
నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే
నా బంధు మిత్రుడ నీవే యేసయ్య (2)
3. నేను నిన్ను నమ్ముకొంటీని
నీవు నన్ను భయపడకంటివే (2)
నా తోడుయు నీవే, నా నీడవు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్య (2)
No comments:
Post a Comment