జీవప్రధాతవు నను రూపించిన శిల్పివి నీవే ప్రభు
జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభుజగములనేలే మహిమాన్వితుడా నా యెడ నీ కృపను
జాలీ హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను
ఏమని పాడెధాను ఏమని పొగడెధను
1.శుభకరమైన తొలిప్రేమను నే - మరువక జీవింప కృప నీయవా
కోవెలలో నీ కానుక నేనై - కోరికలో నీ వేడుక నీవై
జత కలసి నిలిచి జీవింపదలచి - కార్చితివి నీ రుధిరమే
నీ తాగఫలితం నీ ప్రేమమధురం - నాసొంతమే యేసయ్య ||జీవప్రధాతవు||
2.నేనేమైయున్న నీ కృపా కదా - నాతో నీ సన్నిధి పంపవా
ప్రతికులతలు శృతిమించినాను - సంధ్యాకాంతులు నిదురించినాను
తొలివెలుగు నీవై ఉదయించినాపై - నడిపించినది నీవయ్యా
నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి - బలపరచినా యేసయ్య ||జీవప్రధాతవు||
3.మహిమను ధరించినయోధులతో కలసి - దిగివచ్చేదవు నాకోసమే
వేల్పులలోన బహుఘనుడవు నీవు - విజయవిహారుల ఆరాధ్యుడవు
విజయోత్సవముతో ఆరాధించెను - అభిషక్తుడవు నీవని
ఏనాడు పొందని ఆత్మాభిషేకముతో - నింపుము నా యేసయ్య ||జీవప్రధాతవు||
No comments:
Post a Comment