Friday, March 7, 2025

Priyamaina Naa Yesayya - ప్రియమైన నా యేసయ్య

 ప్రియమైన నా యేసయ్య

ఎప్పుడో నీ రాకడ - 2
నీ కోసమే వేచి యుండుటకు - 2
కృపలోనే నను నిలుపుమా
సంఘములో ఒక స్థంబముగా - 2  ||ప్రియమైన||


1. నా కోసమే..
ప్రేమతో రాసిన సందేశము - 2
ప్రియతమా నాలో ఆశలు రేపి
ప్రేమలో చల్లారిపోనీయక
మొదటి ప్రేమలో జ్ఞ్యప్తిక చేసెనే - 2  ||ప్రియమైన||


2. నా కాపరీ...
నిత్యము జీవించు ప్రధాన యాజకుడా - 2
జీవింపజేసే మాటలు విడిచి
ఎవని యొద్దకు వెళ్లెదను
విశ్వసించితిని జీవపు ఊటవు నీవేనని - 2  ||ప్రియమైన||


3. ప్రాణేశ్వరా..
పరిశుద్ధతలో పరిపూర్ణుడా - 2
నీకిష్టుడనై నీలో వొదిగి
సంపూర్ణతకు నేనెదిగీ
నిత్యములో నీతో నేనుండెదను -2  ||ప్రియమైన||

No comments: