Friday, March 7, 2025

Vijaya geethamu manasaara - విజయ గీతము మనసార

 విజయ గీతము మనసార నేను పాడెద

నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు (2)
పునరుత్తానుడ నీవే
నా ఆలాపన నీకే నా ఆరాధన (2)

1. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే
పుటము వేసితివే నీ రూపము చూడ నాలో (2)
యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది
నీ ఉత్తమమైన సంఘములో (2)                    ||విజయ||

2. ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవి
నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో (2)
యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము
నీ పరిశుద్ధులలో చూపినది (2)                    ||విజయ||

3. నూతన యెరుషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు
ఈ నిరక్షణయే రగులుచున్నది నాలో (2)
యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించె
నీ ప్రసన్న వదనమును ఆరాధించ (2)                    ||విజయ||

No comments: