Friday, March 7, 2025

Prabhuvaa Nee Kaluvari - ప్రభువా నీ కలువరి

 ప్రభువా నీ కలువరి త్యాగము

చూపెనే నీ పరిపూర్ణతను
నాలో సత్‌ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే   ||ప్రభువా ||

1. నీ రక్షణయే ప్రాకారములని
ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి  ||2||
లోకములోనుండి ననువేరు చేసినది
నీదయా సంకల్పమే  ||2||  ||ప్రభువా||

2. జీవపు వెలుగుగ నను మార్చుటకే
పరిశుద్ధాత్మను నాకొసగితివే  ||2||
శాశ్వత రాజ్యముకై నను నియమించినది
నీ అనాది సంకల్పమే  ||2||  ||ప్రభువా||

3. సంపూర్ణునిగా నను మార్చుటకే
శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే  ||2||
పరిపూర్ణ శాంతితో నను కాచుటయే
నీ నిత్యసంకల్పమే  ||2||  ||ప్రభువా||

No comments: