Thursday, March 6, 2025

Naa Stuthi Paathruda - నా స్తుతి పాత్రుడా

 నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యా

నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా (2)



1. నీ వాక్యమే నా పరవశము

నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము (2)

నీ వాక్యమే నా పాదములకు దీపము (3)    ||నా స్తుతి||

2. నీ కృపయే నా ఆశ్రయము

నీ కృపయే నా ఆత్మకు అభిషేకము (2)

నీ కృపయే నా జీవన ఆధారము (3)    ||నా స్తుతి||

3. నీ సౌందర్యము యెరూషలేము

నీ పరిపూర్ణత సీయోను శిఖరము (2)

నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము (3)    ||నా స్తుతి||

Naa Svasthyamaina Paralokamu - నా స్వాస్థ్యమైన పరలోకము

 నా స్వాస్థ్యమైన పరలోకము - ఎప్పుడు చేరెదనో

సౌందర్య సీయోనులో - నా ప్రభువైన యేసయ్యను
రారాజుగా నా కన్నులతో - ఎప్పుడు చూచెదనో

1. మహోన్నతుడా - తేజోనివాసి - మహిమానంత విడిచి ||2||
నాకోసమే - దిగి వచ్చిన ప్రేమసాగరా
నా కోసమే పోరాడి చేరనుంది విడిపించినవా ||2||

2. మహా ఘనుడా - మహిమా స్వరూపి స్తుతి మహిమలు నీకే ||2||
నా కాలుజారే చోటు నుండి - నీ తేజో మహిమ నిలిచె
సంఘములో నన్ను నిలిపిన - నా మహిమైశ్వర్యమా ||2||

3. మహనీయుడా - మహానందమే కడవరి పిలుపులో ||2||
ఆత్మయు - పెండ్లి కుమార్తె రమ్మనె ఆ పిలుపు కోసం
నే వేచి యుండెదను - నీకృప తోడుండగా ||2||

Naa Thandri Neeve - నా తండ్రి నీవే

 నా తండ్రి నీవే - నా దేవుడవు నీవే

నా తండ్రి నీవే - నీవే ||నా తండ్రి||

యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా

యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా ||నా తండ్రి||


నా అడుగులు తప్పటడుగులై - నడిచిన నా ప్రతి మార్గము

సరిచేయు నా తండ్రివి (2)

పగలు ఎండ దెబ్బయైనను - రాత్రి వెన్నెల దెబ్బయైనను

తగులకుండ కాచే నీ ప్రేమ

యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా

యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా ||నా తండ్రి||


గాడాంధకార లోయలో - నే నడచిన ప్రతివేలలో

తోడున్న నా తండ్రివి (2)

వేయిమంది కుడి ఎడమకు - కూలినా కూలును కాని

చెదరకుండ నన్ను కాపడు ప్రేమ

యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా

యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా (4) ||నా తండ్రి||

Kalavarapadi ne kondalavaipu - కలవర పడి నే కొండలవైపు

 కలవర పడి నే కొండలవైపు నా - కన్నులెత్తుదునా ?

కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?
కొదువతో నేను కుమిలెదనా ?
కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?

1. నీవు నాకుండగా - నీవే నా అండగా ||2||
నీవే నా ||3||
నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు  ||కొండ||

2. సర్వకృపానిధివి - సంపదల ఘనివి ||2||
సకలము ||3||
సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద   ||కొండ||

3. నిత్యమూ కదలని - సీయోను కొండపై ||2||
యేసయ్యా ||3||
యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద
కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?  ||కొండ||

Kaluvarigirilo Siluva Dhaariyai - కలువరిగిరిలో సిలువధారియై

 కలువరిగిరిలో సిలువధారియై

వ్రేలాడితివా నా యేసయ్యా ||2||

1. అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను
ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా ||2||
నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా
నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా ||2||            ||కలువరిగిరిలో||

2. దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను
ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను ||2||
ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి
నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా ||2||                ||కలువరిగిరిలో||

Kalyanam Kamaneeyam - కళ్యాణం కమనీయం.

 కళ్యాణం కమనీయం - ఈ సమయం అతి మధురం

అ.ప: దేవా రావయ్యా - నీ దీవెనలీవయ్యా (2)

1. ఏదెను వనమున యెహోవ దేవా - మొదటి వివాహము చేసితివే (2)

ఈ శుభ దినమున - నవ దంపతులను - నీ దీవెనలతో నింపుమయా(2) ||కళ్యాణం||

2. కానా విందులో అక్కర నెరిగి - నీళ్ళను రసముగ మార్చితివే (2)

కష్టములలో నీవే - కొరతలు తీర్చి - నడుపుమయా (2) ||కళ్యాణం||

3. బుద్దియు జ్ఞానము సంపదలన్నియు - గుప్తమై యున్నవి నీయందే (2)

ఇహపర సుఖములు - మెండుగ నొసగిన - ఇల వర్దిల్లగ జేయుమయా(2) ||కళ్యాణం||

Karunaa Sampannuda - కరుణా సంపన్నుడా

 కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా  

నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా  ||2||

నాపైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే

నా యేసయ్యా సాత్వీకుడా

నీకోసమే నా జీవితం   ||కరుణా||

1. ఏ నాడు నను వీడని  -  నీ ప్రేమ సందేశము

నా హృదయసీమలోనే  -  సందడిని చేసెను  ||2||

అణువణువును బలపరిచే  -  నీ జీవపువాక్యమే

ప్రతిక్షణము దరిచేరి  -  నన్నే తాకెను   ||2||

ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసి నన్నే నడిపించెను   ||కరుణా||  

                                                   

2. ఈ వింత లోకంలో -  నీ చెంత చేరితిని

ఎనలేని ప్రేమలోనే -  ఆదరణ పొందితిని  ||2||

నీ కృపలో నిలిపినది - నీ ప్రేమబందమే

అనుదినము మకరందమే - నీ స్నేహబంధము  ||2||

ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా -  స్థిరపరచుమా  ||కరుణా||


3. నే వేచియున్నాను -  నీ మహిమ ప్రత్యక్షతకై

నాకున్నా ఈ నిరీక్షణనే - సన్నిధిలో నిలిపినది  ||2||

నా కోసం నిర్మించే - సౌందర్యనగరములో

ప్రణమిల్లి చేసెదను -  నీ పాదాభివందనం ||2||

తేజోమయా  నీ శోభితం -  నే పొందెద కొనియాడెద  ||కరుణా||